ఉక్రెయిన్ కు పాకిస్థాన్ ఆయుధ సాయం?.. భారత్ రష్యాల బంధం బలపడుతున్న వేళ పాక్ ఎత్తుగడ!

22-12-2022 Thu 10:48 | International
Advertisement
  • మోర్టార్లు, రాకెట్ లాంచర్లను సముద్ర మార్గంలో పంపనున్న పాకిస్థాన్
  • ప్రతిఫలంగా ఎంఐ 17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేయనున్న ఉక్రెయిన్ కంపెనీ
  • ఆ రెండు దేశాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు
Advertisement
రష్యాతో ఒంటరిగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు పాకిస్థాన్ ఆయుధ సాయం చేయనుందని ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ రష్యాల మధ్య బంధం పెరుగుతుండడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాయి. చాలా దేశాలు ఈ ఆంక్షలను అమలుచేయగా.. భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలును తగ్గించకుండా రష్యాకు అండగా నిలిచింది. 

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయాలని నిర్ణయం తీసుకుందట. సముద్ర మార్గం గుండా ఆయుధాలను పంపించాలని పాక్ నిర్ణయించుకుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. ప్రతిగా తమ మిలటరీలోని ఎంఐ-17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఉక్రెయిన్ కంపెనీ నుంచి సాయం పొందాలని పాక్ పాలకులు భావిస్తున్నట్లు పేర్కొంది.

మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి.. తదితర ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. ఉక్రెయిన్ పక్కనే ఉన్న యురోపియన్ యూనియన్ దేశానికి ఈ ఆయుధాలను చేర్చనుందని పేర్కొంది. దీనికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ కు చెందిన యుద్ధ విమానాల ఇంజన్ల తయారీ కంపెనీ పాకిస్థాన్ దగ్గరున్న హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేయడానికి సాయం చేస్తుందని వివరించింది.

ఉక్రెయిన్ పాక్ ల మధ్య చాలాకాలంగా మిలటరీ, వాణిజ్య అంశాల్లో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2020 వరకు సుమారు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను ఉక్రెయిన్ నుంచి పాక్ కొనుగోలు చేసింది. ఇందులో ఉక్రెయిన్ తయారుచేసిన టి-80 యూడీ యుద్ధ ట్యాంకులు 320 కి పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు మొత్తం ఉక్రెయిన్ చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
Advertisement
Ukraine russia warPakistanammunition to ukraineindia

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more